News August 21, 2024
ప్రిడేటరీ ప్రైసింగ్ అంటే..

ఇదొక వ్యాపార వ్యూహం. ఏదైనా రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న కంపెనీలు తమ ఉత్పత్తులకు తక్కువ ధరలు నిర్ణయిస్తాయి. కొన్నిసార్లు తమకయ్యే ఖర్చు కన్నా తక్కువ ధర పెట్టి నష్టాలను భరిస్తాయి. కస్టమర్లను పెంచుకొని పోటీ సంస్థలను తొక్కేస్తాయి. మోనోపలి స్థాయికి చేరాక అమాంతం ధరలు పెంచేసి, క్వాలిటీ తగ్గించి కస్టమర్లకు ఛాయిస్ లేకుండా చేస్తాయి. వేగంగా నష్టాల్ని పూడ్చుకొని లాభాలు గడిస్తాయి. చాలా దేశాల్లో ఇది నేరం.
Similar News
News January 13, 2026
‘MSVPG’కి ఫస్ట్ డే రూ.84 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నిన్న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీమియర్స్+ఫస్ట్ డేకి కలిపి రూ.84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అన్ని సెంటర్లలో రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయని పేర్కొంది. చిరంజీవి లుక్స్, మేనరిజం, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అభిమానులను మెప్పిస్తున్నాయి.
News January 13, 2026
టెన్త్ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<
News January 13, 2026
రూ.5,000 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.380 పెరిగి రూ.1,42,530కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,30,650 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,92,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుంటాయి.


