News August 21, 2024
లోకేశ్ టీ, బిస్కెట్ల ఖర్చులపై పోస్టులు.. ఖండించిన ఫ్యాక్ట్ చెక్

AP: మంత్రి నారా లోకేశ్ టీ, బిస్కెట్ల ఖర్చులపై జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇదంతా పూర్తి అసత్యమని, ప్రజలు నమ్మొద్దని కోరింది. ఇటువంటి ఫేక్ పోస్టులు పెట్టేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా అత్యంత ఖరీదైన టీ కోసం నారా లోకేశ్ నెలకు రూ.60 లక్షలు, బిస్కెట్లకు నెలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Similar News
News November 12, 2025
CMగా తేజస్వీ వైపే ప్రజల మొగ్గు: Axis My India

బిహార్‌లో ఎన్డీయే గెలుస్తుందని Axis My India <<18269672>>ఎగ్జిట్ పోల్<<>> సర్వే అంచనా వేసింది. అయితే CMగా ఎవరైతే బెటర్ అనే విషయంలో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కంటే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వైపే ఎక్కువ మంది మొగ్గుచూపినట్లు తెలిపింది. తేజస్వీకి 34%, నితీశ్‌కు 22% మంది మద్దతు తెలిపినట్లు వెల్లడించింది. బీజేపీ అభ్యర్థికి 14%, చిరాగ్ పాస్వాన్‌కు 5% మంది సపోర్ట్ చేయడం గమనార్హం.
News November 12, 2025
ఒక్కో అంతస్తు ఎన్ని అడుగులు ఉండాలి?

ఇంటి నిర్మాణంలో ఒక్కో అంతస్తు ఎత్తు కనీసం 10.5 నుంచి 12 అడుగుల మధ్య ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ కొలత పాటించడం వల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయంటున్నారు. ‘ఇది ఇంట్లో ప్రాణశక్తి ప్రవాహాన్ని పెంచి, నివాసితులకు ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తక్కువ ఎత్తు ఉన్న అంతస్తులు నిరుత్సాహాన్ని, ఇరుకుతనాన్ని కలిగిస్తాయి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 12, 2025
విచారణకు పూర్తి స్థాయిలో సహకరించా: ధర్మారెడ్డి

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ సిట్ రెండో రోజు 8 గంటలపాటు విచారించింది. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించినట్లు ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. ‘అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే నన్నూ విచారించారు’ అని మీడియాకు తెలిపారు.


