News August 21, 2024
BREAKING: వైసీపీ కార్యాలయానికి నోటీసులు

AP: మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19న దాడి జరిగే ముందు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు పోలీసులు నోటీసులిచ్చారు.
Similar News
News January 26, 2026
బంగారం ధర.. ఆల్ టైమ్ రికార్డు

ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చరిత్రలో తొలిసారి ఔన్స్ (28.35గ్రా) బంగారం $5,000కి (₹4.59L) చేరింది. ఒక ఔన్స్ సిల్వర్ $100గా ఉంది. 2025లో గోల్డ్ రేట్ 60%, వెండి 150% పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. US-NATO, ఇరాన్, గ్రీన్లాండ్ టెన్షన్స్, ట్రంప్ టారిఫ్స్ వంటివి దీనికి కారణాలుగా చెబుతున్నాయి. 2026 చివరికి బంగారం ఔన్స్ $5,400కి చేరొచ్చని అంచనా. ఈ పెరుగుదల భారత్ సహా ఇతర మార్కెట్లపైనా ప్రభావం చూపనుంది.
News January 26, 2026
తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<


