News August 21, 2024

ఏ విచారణకైనా సిద్ధం: MLC బొత్స

image

AP: ఇప్పటికీ విశాఖ రాజధాని అనేది తమ పార్టీ విధానమని YCP MLC బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శాసనమండలిలో ఛైర్మన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ‘పార్టీలో ఒడుదొడుకులు సహజం. ఆందోళన వద్దు. పార్టీలోకి కొత్త నీరు వస్తుంది. పాత నీరు పోతుంది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. YCP నేతలపై దాడులు ఆపాలి. మా పాలనపై ఏ విచారణకైనా సిద్ధం. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News February 13, 2025

విజయసాయి రెడ్డి స్థానంలో కన్నబాబు

image

AP: వైసీపీలో పలు నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించారు. గతంలో ఈ స్థానంలో విజయసాయి రెడ్డి ఉండేవారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

News February 13, 2025

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం ఎవరిదంటే?

image

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మళ్లీ BJPనే అధికారం చేపడుతుందని INDIA టుడే-Cఓటర్ సర్వే తెలిపింది. BJP ఒంటరిగానే 281 సీట్లు, NDA కూటమి మొత్తంగా 343 స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది. గత ఎన్నికల్లో 232 సీట్లు గెలుపొందిన INDIA కూటమి 188 స్థానాలకు పడిపోతుందని, కాంగ్రెస్ 78 సీట్లకే పరిమితం కానుందని పేర్కొంది. JAN 2 నుంచి FEB 9 వరకు 1,25,123 మందిపై సర్వే జరిపినట్లు తెలిపింది.

News February 12, 2025

కొత్త 50 రూపాయల నోట్లు

image

ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈమేరకు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న చాలా నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ప్రింట్ అయ్యాయి. ఆయన స్థానంలో గతేడాది డిసెంబర్‌లో వచ్చిన సంజయ్ పేరుతో కొత్త రూ.50 నోట్లను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

error: Content is protected !!