News August 21, 2024

అప్పిరెడ్డి రాజీనామా.. శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స?

image

AP: శాసనమండలి ఫ్లోర్ లీడర్ పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను మండలిలో ప్రతిపక్ష నేతగా నియమించే అవకాశం ఉంది. కాసేపట్లో దీనిపై పార్టీ అధికారిక ప్రకటన చేయనుంది. కాగా కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News January 15, 2025

మీరు గేమ్ నుంచి తీసేయొచ్చు.. కానీ నా వర్క్‌ను ఆపలేరు: పృథ్వీ షా

image

జాతీయ జట్టుతోపాటు దేశవాళీ టీమ్‌లో తనకు చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా పరోక్షంగా స్పందించారు. ‘మీరు నన్ను గేమ్ నుంచి తీసేయొచ్చు. కానీ నా వర్క్‌ను మాత్రం ఆపలేరు’ అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు అతను కొన్ని వారాలుగా మైదానం, జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా పృథ్వీని ఏ జట్టూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే.

News January 15, 2025

నన్ను దేవుడే రక్షిస్తాడు: కేజ్రీవాల్

image

ఖ‌లిస్థానీ వేర్పాటువాదుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌న్న వార్త‌ల‌పై కేజ్రీవాల్ స్పందించారు. దేవుడే త‌న‌ను ర‌క్షిస్తాడ‌ని, దేవుడు అనుమ‌తించినంత కాలం జీవిస్తాన‌ని పేర్కొన్నారు. దేవుడే ర‌క్షించే వారిని ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ల‌క్ష్యంగా ఖ‌లిస్థానీ మ‌ద్ద‌తుదారుల హిట్ స్క్వాడ్ ఏర్పడింద‌ని, ఢిల్లీ ఎన్నిక‌ల్లో వారు కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసుకున్న‌ట్టు నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి.

News January 15, 2025

ఇంటి వద్దకే టెక్నీషియన్లు.. తక్కువ ధరకే సర్వీస్: టీడీపీ

image

AP: వృత్తిదారులను ఆదుకునేందుకు CM CBN ఆదేశాలతో ‘హోమ్ ట్రయాంగిల్ యాప్’తో మెప్మా ఒప్పందం చేసుకుందని TDP వెల్లడించింది. ‘20వేల మంది టెక్నీషియన్లకు మెప్మా శిక్షణ ఇస్తోంది. TV, AC, ఫ్రిజ్, కంప్యూటర్ తదితర 30 రకాల డివైజ్‌లు పాడైతే టెక్నీషియన్లు ఇంటి వద్దకే వచ్చి తక్కువ ధరకే బాగుచేస్తారు. MAR నుంచి 123 పట్టణాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో టెక్నీషియన్‌కు ₹20-25వేల ఆదాయం వస్తుంది’ అని పేర్కొంది.