News August 21, 2024

వారికి మాత్రమే రుణమాఫీ ఆగింది: తుమ్మల

image

TG: ఇప్పటివరకు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందన్నారు. దీనికి సంబంధించి రైతులు వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని సరిదిద్ది మాఫీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.

Similar News

News January 24, 2025

నాన్‌స్టాప్ అడ్వెంచర్‌గా రాజమౌళి-మహేశ్ మూవీ!

image

మహేశ్‌తో రాజమౌళి చిత్రీకరిస్తున్న మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో నాన్‌స్టాప్ అడ్వెంచర్‌గా ఉంటుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే HYD అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. ఈ నెలాఖరులో మరో షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రా ఫైనల్ అయ్యారని, ఆమె బల్క్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

News January 24, 2025

జీతం ఆలస్యమైతే.. ఎమర్జెన్సీ ఫండ్ ఉందా?

image

అనుకోని సందర్భాల్లో జీతం ఆలస్యమైతే ఏం చేస్తారు? చాలామంది ఉద్యోగులకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడెలాగూ చాలామందికి రెండు మూడు బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. అందుకే వచ్చిన జీతంలో ప్రతినెలా కొంత మొత్తాన్ని మరో ఖాతాకు బదిలీ చేసుకోవాలి. దీంతో అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉపయోగపడటంతో పాటు అప్పుల్లో కూరుకుపోకుండా చేస్తుంది. మరి మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా?

News January 24, 2025

సైఫ్ అలీ‌ఖాన్‌పై దాడి.. ఆ వేలిముద్రలు నిందితుడివే!

image

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో పట్టుబడిన నిందితుడి, ఘటనాస్థలిలో దొరికిన వేలిముద్రలు ఒకటే అని పోలీసులు నిర్ధారించారు. నటుడి ఇంటి వద్ద CC ఫుటేజీలో కనిపించిన వ్యక్తి తన కుమారుడు కాదని నిందితుడి తండ్రి వారించారు. దీంతో సైఫ్ ఇంట్లోకి వెళ్లేందుకు నిందితుడు ఎక్కిన పైప్, తలుపులపై ఉన్న వేలిముద్రలను పరిశీలించారు. సైఫ్ 2వ కుమారుడి గదిలో దొరికిన క్యాప్‌కు ఉన్న వెంట్రుకను సైతం పోలీసులు DNA టెస్టుకు పంపారు.