News August 21, 2024
శాసనమండలి ప్రతిపక్షనేత పదవికి అప్పిరెడ్డి రాజీనామా

ఏపీ శాసనమండలి ప్రతి పక్షనేత పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అవకాశం కల్పించాలని వైఎస్ జగన్‌ను అప్పిరెడ్డి కోరారు. బుధవారం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫ్లోర్’ పదవికి సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ఇస్తే బాగుంటుందని వైఎస్ జగన్‌ను కోరా. ఆ పదవిలో సీనియర్ నేత ఉంటే బాగుంటుందని చెప్పా. నా ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారని వివరించారు.
Similar News
News November 7, 2025
GNT: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

శంకర కంటి ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 9న సీఎం చంద్రబాబు విచ్చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పెదకాకాని మండలంలో హెలిపాడ్, సీఎం పాల్గొనే ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 7, 2025
గుంటూరు జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

రహదారి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కాజా టోల్గేట్, తాడికొండ అడ్డరోడ్డు, పేరేచర్ల, నారాకోడూరు, నందివెలుగు రోడ్డు, వాసవి క్లాత్ మార్కెట్, చుట్టుగుంట ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. 78 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటూ రూ. 7,79,720 జరిమానా విధించామని SP వకుల్ జిందాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అంబులెన్స్ సీజ్ చేశామన్నారు.
News November 7, 2025
GNT: రెండవ శనివారం సెలవుపై సడలింపు..రేపు స్కూల్స్‌కి హాలిడే

తుఫానుకు 4 రోజులు ఇచ్చిన సెలవులను భర్తీ చేస్తూ 2వ శనివారం కూడా స్కూల్స్ పనిచేస్తాయని చేసిన ప్రకటనను సడలించారు. గత నెల 23న అన్ని పాఠశాలలు తమ స్థానిక సెలవులలో ఒకదాన్ని వినియోగించుకోవడం వల్ల 8వ తేదీ 2వ శనివారం పని చేయవలసిన అవసరం లేదని తమకు సమాచారం వచ్చినట్లు తెనాలి ఎంఈఓ జయంత్ బాబు తెలిపారు. మిగిలిన 3 సెలవులను ప్రొసీడింగ్స్‌లో జారీ చేసిన విధంగా వచ్చే 3 నెలల్లో 2వ శనివారాలతో భర్తీ చేసుకోవచ్చన్నారు.


