News August 21, 2024

అర్ధరాత్రి నుంచి ‘కల్కి’ స్ట్రీమింగ్

image

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా ఈరోజు అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 27న రిలీజైన ఈ సినిమా 50రోజులు సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో ప్రదర్శితమవగా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. OTTలోనూ రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో, నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో స్ట్రీమింగ్ కానుంది.

Similar News

News January 26, 2025

స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు: గవర్నర్

image

AP: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ నజీర్ అన్నారు. విజయవాడలో గణతంత్ర వేడుకల్లో మాట్లాడుతూ ‘గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించింది. స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసింది. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే ప్రభుత్వ నినాదం’ అని వ్యాఖ్యానించారు.

News January 26, 2025

అర్ధరాత్రి అకౌంట్లలో రూ.6,000 జమ

image

TG: ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్నారు. రైతు భరోసా కింద పంట సాగు చేస్తున్న అన్నదాతలకు ఎకరాకు రూ.6వేలు అకౌంట్లలో జమ కానున్నాయి. ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు కూడా రూ.6వేలను అకౌంట్లలో వేయనున్నారు. అయితే ఇవాళ ఆదివారం సెలవు కావడంతో అర్ధరాత్రి 12 గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ కానున్నట్లు అధికారులు తెలిపారు.

News January 26, 2025

ఇది కర్షక ప్రభుత్వం: గవర్నర్ జిష్ణుదేవ్

image

TG: ప్రజా ప్రభుత్వం కర్షకులకు రైతు భరోసా అందిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ‘వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నాం. సన్నరకం బియ్యానికి బోనస్ అందించాం.2024 వానాకాలంలో 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశాం. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్నాం. యువత సాధికారత కోసం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం’ అని గణతంత్ర దినోత్సవం ప్రసంగంలో వివరించారు.