News August 21, 2024

అచ్యుతాపురంలో రియాక్టర్‌ పేలుడు ఘటనపై జగన్‌ దిగ్భ్రాంతి

image

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్‌ పేలుడు ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Similar News

News December 28, 2025

కోడూరు పంట కాలువలో మృతదేహం కలకలం

image

కోడూరు-అవనిగడ్డ ప్రధాన పంట కాలువలో సుమారు 25 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ చాణిక్య తెలిపారు. ఆదివారం మాచవరం గ్రామం వద్ద కాలువలో కొట్టుకొచ్చిన ఈ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, నలుపు ప్యాంట్ ధరించి ఉన్నాడని వివరించారు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు వెంటనే కోడూరు లేదా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని కోరారు.

News December 28, 2025

కృష్ణా: గ్యాస్ బావుల తవ్వకానికి 35 చోట్ల అనుమతులు..?

image

కృష్ణా జిల్లాలోని గూడూరు, పామర్రు, మొవ్వ మండలాల పరిధిలోని 35 ప్రాంతాల్లో వేదాంత సంస్థ చమురు, గ్యాస్ తీసుకునేందుకు పరిశీలిస్తోంది. పంట కాలువలకు దూరంగా ఆయిల్, గ్యాస్ తీసేందుకు బావులు ఏర్పాటు చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులు సంస్థకు సూచించినట్లు తెలుస్తోంది. ఒక్కో బావిని 3-4 వేల మీటర్ల లోతులో తవ్వి పైపులను వేయనున్నారు, దీనివల్ల వ్యవసాయ భూములకు ఎలాంటి నష్టం వాటిల్లదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

News December 27, 2025

కృష్ణా: జోగి రమేశ్ ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యం తయారీ.!

image

మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులైన అద్దేపల్లి జనార్ధనరావు, జగన్మోహనరావులను పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో శుక్రవారం వీరి ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేశ్ అందించిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యాన్ని తయారు చేశామని నిందితులు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.