News August 21, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి జల్లులు కురుస్తాయంది.

Similar News

News January 12, 2026

PPP విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి: CBN

image

AP: నిధులు లేవని పనులు ఆపొద్దని, క్రియేటివ్‌గా ఆలోచించి ముందుకెళ్లాలని CBN సూచించారు. PPP పద్ధతిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులు, మంత్రులతో సమీక్షలో ఆదేశించారు. ‘కేంద్ర నిధులను కొన్ని శాఖలు ఖర్చు చేయడం లేదు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఎక్కువ నిధులు వచ్చే అవకాశమున్నా ఖర్చు చేయలేదు. నెలాఖరులోగా పూర్తి చేసి అదనపు నిధులు కోరాలి. కేంద్రం నుంచి అదనంగా నిధులు తెచ్చుకోవచ్చు’ అని CM పేర్కొన్నారు.

News January 12, 2026

టిమ్ కుక్ తర్వాత యాపిల్ బాస్ ఇతనేనా?

image

యాపిల్ CEOగా టిమ్ కుక్ తర్వాత జాన్ టెర్నస్ బాధ్యతలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. 50 ఏళ్ల ఈ హార్డ్‌వేర్ ఎక్స్‌పర్ట్ 2001 నుంచే కంపెనీలో ఉన్నారు. ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్ వంటి హిట్ ప్రొడక్ట్స్ వెనుక ఇతని హస్తం ఉంది. కాలేజీ రోజుల్లో వర్సిటీ స్విమ్మర్ అయిన టెర్నస్ ఇప్పుడు యాపిల్ పగ్గాల కోసం రేసులో ముందున్నారు. ఆయన డీటైలింగ్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ యాపిల్‌కు కొత్త వెలుగునిస్తాయని భావిస్తున్నారు.

News January 12, 2026

పండుగల్లో ఆఫర్ల మాయలో పడకండి

image

పండుగ సమయాల్లో ప్రకటించే ఆఫర్ల మాయలో పడ్డామంటే బడ్జెట్ దాటిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఒక్కరోజు ఆనందం కోసం చూస్తే కొన్ని నెలలపాటు సర్దుబాటు చేసుకోవాలి. కాబట్టి అప్పు తీసుకోవద్దు అనే నియమాన్ని పాటించండి. వేటికెంత కేటాయించాలో ముందే నిర్ణయించుకోండి. నాణ్యతలో రాజీ పడకూడదు. డిస్కౌంట్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఏమేం కావాలో జాబితా రాసుకొని దానికే పరిమితమవ్వాలి.