News August 21, 2024
నెల్లూరులో ప్రకాశం జిల్లా వాసి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా కొమురోలు గ్రామానికి చెందిన షేక్ జలీల్ (60) నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మణికంఠ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యా భర్తల మధ్య మనస్పర్థల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.
Similar News
News January 13, 2026
సింగరాయకొండలో చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలు

చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలైన ఘటన మంగళవారం సింగరాయకొండలో చోటుచేసుకుంది. బాధితుడు, పోస్ట్‌మ్యాన్ గోపి వివరాల మేరకు.. ఉదయాన్నే ఉత్తరాల బట్వాడా చేసే సమయంలో గాలిపటానికి ఉపయోగించే చైనా మాంజా దారం మెడకు తగిలి గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మాంజ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.
News January 13, 2026
త్రిపురాంతకం హైవేపై రోడ్డు ప్రమాదం.!

త్రిపురాంతకం మండలంలోని ముడివేముల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో- బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కూరగాయల ఆటోలో ఉన్న పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సహాయంతో వినుకొండకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 13, 2026
మరోసారి తెరపైకి ప్రకాశం జిల్లా ఎయిర్‌పోర్ట్

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పోర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్‌తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.


