News August 21, 2024
అచ్యుతాపురం: ఉలిక్కిపడిన సమీప గ్రామాలు

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియాక్టర్ పేలిన సమయంలో భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సెజ్ లోని అగ్నిమాపక యంత్రంతో పాటు 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. రియాక్టర్ పేలుడు ధాటికి మొదటి అంతస్తు శ్లాబు కూలిపోగా, శిథిలాల కింద ఉన్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 16మంది కార్మికులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News September 22, 2025
విశాఖలో కేంద్రమంత్రి స్వాగతం పలికిన కలెక్టర్

28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి (DARPG & DOPPW) జితేంద్రసింగ్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు.
News September 22, 2025
విశాఖలో పిడుగు పడి ఉద్యోగి మృతి

విశాఖలో సోమవారం విషాదం నెలకొంది. మధురవాడ సమీపంలో కొమ్మాది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడి జీవీఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రకాష్(37) మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి పీఎం పాలెం పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
News September 22, 2025
సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో తగ్గనున్న ధరలు

సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో నేటి నుంచి నూతన జి.ఎస్.టి అమలు చేయనున్నట్లు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తెలిపారు. రూ.1000 నుంచి రూ.2500 విలువ గల వస్త్రాలపై 12%గా ఉన్న జి.ఎస్.టి 5%గా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నూతన జి.ఎస్.టి విధానం అమలుతో 6.25% వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు.. వినియోగదారులు గమనించాలన్నారు.