News August 21, 2024
208 కంపెనీలు.. ఒకే ఒక్క ఫైర్ ఇంజిన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724256656752-normal-WIFI.webp)
AP: అనకాపల్లి(D) రాంబిల్లి(M) అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సెజ్‌లో మొత్తం 208 కంపెనీలు ఉంటే కేవలం ఒకే ఒక్క ఫైర్ ఇంజిన్ ఉంది. తాజాగా జరిగిన ప్రమాదంలో మంటలను ఈ ఒక్క ఫైర్ ఇంజిన్ నియంత్రించలేకపోయింది. దీంతో చుట్టు పక్కల ఫైర్ స్టేషన్ల నుంచి ఫైర్ ఇంజిన్లను తెప్పించి మంటలు ఆర్పారు. ఈ సెజ్‌లో గత పదేళ్లలో 13 మంది మరణించారు.
Similar News
News February 13, 2025
రేపు తెలంగాణ బంద్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739408275700_367-normal-WIFI.webp)
TG: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని, నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్ ఎస్సీ కమిషన్‌ను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బంద్ పిలుపుతో శుక్రవారం ఆర్టీసీ బస్సులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఇతర సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
News February 13, 2025
నేడు పార్లమెంటు ముందుకు కొత్త ఐటీ బిల్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739407058954_367-normal-WIFI.webp)
నేడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అలాగే భాష సరళీకరణంగా ఉండనుంది. కొత్త బిల్లులో 526 సెక్షన్లు ఉండనున్నాయి.
News February 13, 2025
కులగణనపై రేపు పీసీసీ ప్రజెంటేషన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734949669231_653-normal-WIFI.webp)
TG: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ రేపు మ.2 గంటలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. గాంధీ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై మంత్రులు వివరణ ఇవ్వనున్నారు.