News August 21, 2024

18 మంది మృతి కలచివేసింది: పవన్ కళ్యాణ్

image

AP: అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 18 మంది మృతి తనను కలచివేసిందని అన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు. మరోవైపు ఘటనపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉండి, క్షతగాత్రులకు వైద్యం అందించాలని ఆదేశించారు.

Similar News

News July 10, 2025

పూజారి అసభ్యంగా తాకాడు: నటి

image

మలేషియాలోని ఆలయంలో పూజారి తనను వేధించినట్లు భారత సంతతి నటి లిశల్లిని కనరన్‌ను ఆరోపించారు. గత నెల 21న సెపంగ్‌లోని మరియమ్మన్ టెంపుల్‌లో ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకుతూ భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం అంటూ నీటిని తనపై పోశాడని ఆమె ఇన్‌స్టాలో ఆరోపించారు. దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News July 10, 2025

రక్తపోటును తగ్గించే ఔషధం!

image

జీవనశైలి మార్పులతో చాలా మంది హైబీపీతో బాధపడుతున్నారు. అయితే శ్వాస వ్యాయామం ద్వారా రక్తపోటును తగ్గించొచ్చని వైద్యులు చెబుతున్నారు. నిమిషానికి ఆరుసార్లు శ్వాస తీసుకోవడం/వదలడం చేస్తే నాడీ వ్యవస్థ, BPని నార్మల్‌కు తీసుకురావొచ్చంటున్నారు. నార్మల్ కేసుల్లో జీవనశైలి & శ్వాస పద్ధతుల ద్వారా మందుల అవసరాన్ని తగ్గించొచ్చని తెలిపారు. 10-20 ని.లకు ఒక సెషన్‌గా రోజులో 3 నుంచి 4 సార్లు ఇది ప్రాక్టీస్ చేయాలన్నారు.

News July 10, 2025

తెలంగాణ లేకుండా చిత్రపటం బహూకరించారు: BRS MLC

image

ఏపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుర్తింపును తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని BRS MLC శ్రవణ్ ఆరోపించారు. మంత్రి లోకేశ్‌కు AP BJP చీఫ్ మాధవ్ తాజాగా భారతదేశ చిత్రపటాన్ని బహూకరించారు. ఇందులో TGని ప్రత్యేకంగా చూపకుండా ఉమ్మడి APని చూపించారని శ్రవణ్ మండిపడ్డారు. ‘ఇది TG గుర్తింపుపై AP నేతలు చేస్తున్న రాజకీయ కుట్రను సూచిస్తోంది’ అని ట్వీట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని TG DGPని కోరారు.