News August 21, 2024

అదానీకి వ్యతిరేకంగా రేపు TPCC నిరసన

image

TG: అధిష్ఠానం పిలుపు మేరకు రేపు ఉ.10 గంటలకు అదానీకి వ్యతిరేకంగా TPCC నిరసన చేపట్టనుంది. ఇందులో CM రేవంత్‌రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, AICC ఇన్‌ఛార్జి దీపా దాస్‌ మున్షీతో పాటు మంత్రులు, MPలు, MLAలు, MLCలు, పార్టీ నేతలు పాల్గొంటారు. అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపాలని, SEBI చైర్ పర్సన్ అక్రమాలపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

Similar News

News January 24, 2025

DSC నోటిఫికేషన్ ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలో మరో DSC నోటిఫికేషన్ APR తర్వాతే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం FEBలోనే నోటిఫికేషన్ రావాలి. కానీ SC వర్గీకరణ కోసం కమిషన్ వేసిన సర్కార్ నివేదిక కోసం ఎదురుచూస్తోంది. దీనికి సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటివరకు DSC నోటిఫికేషన్ రాకపోవచ్చని తెలుస్తోంది. ఇక గతేడాది 11,062 పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం మరో 5వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

News January 24, 2025

కొత్తగూడెం, సాగర్‌లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు స్థలాల పరిశీలన

image

TG: కొత్తగూడెం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం పరిశీలించింది. కొత్తగూడెం సమీపంలోని గరీబ్‌పేట, రామవరం ప్రాంతాల్లో 950 ఎకరాలు, సాగర్ సమీపంలోని ఏపీ వైపు విజయపురి సౌత్ వద్ద 1600 ఎకరాల భూములను చెక్ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

News January 24, 2025

పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి ‘వరం’

image

AP:2027లో జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.271.43 కోట్లు కేటాయించింది. 2071-72 ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లను పిలవగా, పుష్కరాల ప్రతిపాదనలతో వాటిని రద్దు చేసి కొత్త నిధులను కేంద్రం ఇచ్చింది.