News August 22, 2024
నేటి ముఖ్యాంశాలు

* AP: అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడు, 18 మంది మృతి
* ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, ఉన్నతాధికారులతో ఆరా
* సిబ్బంది వివరాలు ఇవ్వాలని కుటుంబ సభ్యుల డిమాండ్
* బాధితులకు రూ.కోటి ఇవ్వాలని మాజీ సీఎం జగన్ డిమాండ్
* TG:రుణమాఫీపై సిగ్గులేకుండా మమ్మల్ని అంటున్నారు: భట్టి
* కలెక్షన్ల కోసమే ‘హైడ్రా’: బండి సంజయ్
* బీజేపీ నేత కేటీఆర్ అనాలి: మంత్రి కోమటిరెడ్డి
* నాకు ఫామ్ హౌస్ లేదు: కేటీఆర్
Similar News
News July 10, 2025
HCAలో అక్రమాలు.. ముగ్గురిపై కేసు నమోదు

HYD క్రికెట్ అసోసియేషన్(HCA)లో నిధుల దుర్వినియోగంపై CID దర్యాప్తు జరుపుతోంది. అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాస రావు, CEO సునీల్‌పై కేసు నమోదు చేసింది. వీరితో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు చెందిన రాజేందర్, కవితను అదుపులోకి తీసుకుంది. సంతకాల ఫోర్జరీ, నకిలీ దస్త్రాలు సృష్టించడంపై విచారిస్తోంది. కాగా SRHను బెదిరించిన కేసులో నిన్న జగన్మోహన్ <<17008940>>అరెస్ట్<<>> అయిన సంగతి తెలిసిందే.
News July 10, 2025
పూజారి అసభ్యంగా తాకాడు: నటి

మలేషియాలోని ఆలయంలో పూజారి తనను వేధించినట్లు భారత సంతతి నటి లిశల్లిని కనరన్‌ను ఆరోపించారు. గత నెల 21న సెపంగ్‌లోని మరియమ్మన్ టెంపుల్‌లో ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకుతూ భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం అంటూ నీటిని తనపై పోశాడని ఆమె ఇన్‌స్టాలో ఆరోపించారు. దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News July 10, 2025
రక్తపోటును తగ్గించే ఔషధం!

జీవనశైలి మార్పులతో చాలా మంది హైబీపీతో బాధపడుతున్నారు. అయితే శ్వాస వ్యాయామం ద్వారా రక్తపోటును తగ్గించొచ్చని వైద్యులు చెబుతున్నారు. నిమిషానికి ఆరుసార్లు శ్వాస తీసుకోవడం/వదలడం చేస్తే నాడీ వ్యవస్థ, BPని నార్మల్‌కు తీసుకురావొచ్చంటున్నారు. నార్మల్ కేసుల్లో జీవనశైలి & శ్వాస పద్ధతుల ద్వారా మందుల అవసరాన్ని తగ్గించొచ్చని తెలిపారు. 10-20 ని.లకు ఒక సెషన్‌గా రోజులో 3 నుంచి 4 సార్లు ఇది ప్రాక్టీస్ చేయాలన్నారు.