News August 22, 2024
శుభ ముహూర్తం

తేది: ఆగస్టు 22, గురువారం
తదియ: మధ్యాహ్నం 01.46 గంటలకు
ఉత్తరాభాద్ర: రాత్రి 10.05 గంటలకు
వర్జ్యం: ఉదయం 09.10- 10.36 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 10.04- 10.54 గంటల వరకు
తిరిగి మధ్యాహ్నం 03.05- 3.56 గంటల వరకు
Similar News
News July 10, 2025
కూలిన బ్రిడ్జి.. 15కు చేరిన మరణాలు

గుజరాత్‌లోని వడోదరలో గంభీర <<17001744>>బ్రిడ్జి<<>> కూలిన ఘటనలో మరణాల సంఖ్య 15కు చేరింది. ఇవాళ మహిసాగర్ నది నుంచి మరో నాలుగు మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రెండు లారీలతో సహా తొమ్మిది వాహనాలు నదిలో పడిపోయాయి. కాగా బ్రిడ్జి కూలడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. బీటలు వచ్చినా దాన్ని మూసివేయలేదని పేర్కొన్నారు.
News July 10, 2025
లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకూ అవకాశమివ్వాలి: రఘునందన్

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో లోక్‌సభ MPలకూ భాగస్వామ్యం కల్పించాలని CM రేవంత్‌ను BJP MP రఘునందన్ రావు కోరారు. ‘లబ్ధిదారుల ఎంపికలో స్థానిక MLAలకు 40% కోటా కేటాయించడం ప్రశంసనీయం. MLAల తరహాలోనే ప్రజల మద్దతుతో గెలిచిన 17 మంది MPలకూ 40% కోటా కేటాయించండి. దీని వల్ల కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో అమలవుతున్న పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది’ అని బహిరంగ లేఖ రాశారు.
News July 10, 2025
అప్పులపై ప్రశ్నిస్తే దేశద్రోహులమా?: బుగ్గన

AP: రాష్ట్రంలో రూ.2,45,000 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయిందని YCP నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ అప్పులపై ప్రశ్నిస్తే తాము దేశద్రోహులమా? అని ఆయన నిలదీశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? తల్లికి వందనం కొంతమందికే ఇచ్చారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం ఏమయ్యాయి?’ అని ఆయన ఫైర్ అయ్యారు.