News August 22, 2024

పీఈటీ పోస్టుల తుది జాబితా విడుదల

image

TG: గురుకులాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) పోస్టుల తుది జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించింది. 594 మంది అభ్యర్థులతో కూడిన ప్రైమరీ లిస్టును ప్రకటించింది. టీజీపీఎస్సీ 2017లో జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో ఎవరైనా అభ్యర్థులు పోస్టును స్వచ్ఛందంగా వదులుకునేందుకు ఈ 22 నుంచి 24 వరకు సదుపాయం కల్పించింది. పూర్తి జాబితా కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 24, 2025

సైఫ్‌పై కత్తిదాడి: నిందితుడిని కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు

image

యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లామ్‌ను పోలీసులు బాంద్రా కోర్టుకు తీసుకెళ్లారు. నేటితో ముగుస్తున్న అతడి కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాల్సిందిగా వారు మెజిస్ట్రేట్‌ను కోరే అవకాశముంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో అంతుచిక్కని ప్రశ్నలు, అనుమానాలు ఎన్నో ఉన్నాయి. కోర్టు విచారణపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 24, 2025

తండ్రి రికార్డును బద్దలుకొట్టాడు

image

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇంగ్లండ్ లయన్స్ జట్టు తరఫున అతిపిన్న వయసు(16 ఏళ్ల 291 రోజులు)లో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచారు. గతంలో ఈ రికార్డ్ అతడి తండ్రి ఆండ్రూ(20 ఏళ్ల 18 రోజులు) పేరిట ఉండేది. ఆండ్రూ 1998లో కెన్యాపై సెంచరీ చేయగా 26 ఏళ్ల తర్వాత రాకీ క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌పై ఈ రికార్డ్ సాధించారు.

News January 24, 2025

TDS రాజ్యాంగవిరుద్ధం: పిల్ తిరస్కరించిన CJI

image

TDSను నిరంకుశం, నిర్హేతుకం, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలన్న పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘సారీ, మేం దీన్ని విచారించలేం. పిల్‌ను ఘోరంగా డ్రాఫ్ట్ చేశారు. మీరు హైకోర్టుకు వెళ్లొచ్చు. దీనిని మేం తిరస్కరిస్తున్నాం’ అని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. TDS సమానత్వ హక్కును హరించేస్తోందని, గుదిబండగా మారిందని BJP నేత, లాయర్ అశ్విని కుమార్ పిల్ దాఖలు చేశారు.