News August 22, 2024
వచ్చే నెల నుంచి జనగణన?
వచ్చే నెల నుంచి దేశంలో జనగణన చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్లకోసారి జనాభా లెక్కింపు జరగాల్సి ఉండగా కొవిడ్ కారణంగా 2021లో వాయిదా పడింది. జనగణన చేయాలని కేంద్రంపై ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలకు దిగాయి. హోంశాఖ నేతృత్వంలో జరిగే ఈ ప్రక్రియకు 18 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2026లో వివరాలను వెల్లడించే అవకాశముంది.
Similar News
News January 24, 2025
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: నారాయణ
AP: అమరావతి అభివృద్ధి పనులను ఫిబ్రవరి 2వ వారంలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నేలపాడులో అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ పనులను ఆయన పరిశీలించారు. ‘2015లో ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇస్తే 58 రోజుల్లో 34 వేల ఎకరాలను రైతులు ఇచ్చారు. ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరులోగా అన్నీ ఖరారు చేసి, మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం’ అని చెప్పారు.
News January 24, 2025
SHOCKING: అల్ట్రా HDలో ‘గేమ్ ఛేంజర్’ లీక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా అల్ట్రా HDలో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది థియేటర్ ప్రింట్ కాదని, మూవీ ఎడిటింగ్ టీమ్ నుంచే లీక్ అయిందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో CG వర్క్ లేదని స్పష్టంగా కనపడుతోందని అంటున్నారు. రూ.కోట్లు పెట్టి సినిమాలు తీస్తే.. ఇలా పైరసీ చేస్తారా? అని మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
News January 24, 2025
గోల్డ్ రేట్స్ హైక్
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.82,420కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.300 పెరిగి రూ.75,550గా నమోదైంది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.వెయ్యి పెరిగి రూ.1,05,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.