News August 22, 2024
తాడిపత్రిలో 200 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు

తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా 200 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 200 మంది పోలీసులు, 30 మంది స్ట్రైకింగ్ బలగాలతో పట్టణ శివారుల్లో పికెట్, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రిడ్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News November 11, 2025
వరల్డ్ కప్‌లో గుంతకల్లు యువకుడి ప్రతిభ

ఇటీవల భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఉమెన్స్ టీంలో ఒక సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన క్రాంతికుమార్ ఘనత సాధించాడు. క్రాంతి కుమార్ టీం ఫిట్నెస్ కోచ్, ఫిజియోథెరపిస్ట్‌గా టీమ్‌కు సేవలు అందించాడు. గుంతకల్లు పట్టణానికి చెందిన క్రీడాకారుడు ఉమెన్స్ టీం మెంబెర్‌గా ఉండటం గుంతకల్లు పట్టణానికి గర్వకారణం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 10, 2025
కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి 30 వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిపై సర్వే చేపట్టాలన్నారు. వ్యాధి గ్రస్తులను గుర్తించి వైద్యం అందించాలన్నారు.