News August 22, 2024

పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ విన్నర్‌గా వరంగల్ యువతి

image

దేశాయిపేట శివారు లక్ష్మిటౌన్‌ షిప్‌కు చెందిన దీక్షిత పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఈనెల 14 నుంచి 17 వరకు HYDకు చెందిన మాంటి ప్రొడక్షన్‌ సంస్థ మిస్టర్‌ అండ్‌ మిస్‌ గార్జియస్‌ ఆఫ్‌ ఇండియా (సీజన్‌-4) పోటీలను నిర్వహించింది.క్యాన్సర్‌ బాధితులకు ఫడ్‌ రేసింగ్, మహిళలు క్యాన్సర్‌ బారిన పడకుండా ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలపై చేసిన సూచనలకు పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ దక్కినట్లు ఆమె తెలిపారు.

Similar News

News November 27, 2024

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: సీతక్క

image

రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రములో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం దేశం బాగుంటుందని, రైతులకు సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు.

News November 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> WGL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో జరిమానా
> HNK: అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
> NSPT: గంజాయి పట్టివేత
> WGL: వ్యవసాయ బావిలో పడి గొర్రెల కాపరి మృతి
> JN: గుట్కా పట్టివేత
> WGL: ఒకరిపై పీడీ యాక్ట్ నమోదు
> MHBD: రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ మృతి!
> HNK: పరకాల పరిధిలో పోగొట్టుకున్న ఫోన్ అందజేత

News November 26, 2024

ఘనంగా రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకలు

image

గుమ్మడూరు మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. కృతజ్ఞత పూర్వకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డి.రాజేష్ మాట్లాడుతూ.. ప్రజల కొన్నేళ్ల తపస్సు త్యాగం, సామర్థ్యాల ఫలితమే రాజ్యంగమని, ప్రజలందరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.