News August 22, 2024
ప్రకాశం: నామినేటెడ్ పదవి దక్కేది ఎవరికి?

మరో రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవులు ప్రకటించనున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో రాజకీయం మొదలైంది. ఇక్కడి నుంచి దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, దర్శి యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్ బాబుతో పాటు జనసేనా జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరికి పదవి వరిస్తుందనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News January 20, 2026
ప్రకాశం: మద్యం ప్రీమియం స్టోర్‌కి దరఖాస్తులు

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయానికి ప్రీమియం స్టోర్ లైసెన్స్ మంజూరు చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఆసక్తి కలిగినవారు ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులను ఒంగోలు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 20, 2026
ప్రకాశం: మద్యం ప్రీమియం స్టోర్‌కి దరఖాస్తులు

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయానికి ప్రీమియం స్టోర్ లైసెన్స్ మంజూరు చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఆసక్తి కలిగిన వారు ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులను ఒంగోలు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 20, 2026
ప్రకాశం SP మీకోసంకు 48 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు రాగా వారి సమస్యలను పోలీస్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.


