News August 22, 2024

ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు

image

AP: అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 106(1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిన్న జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందగా, మరో 40 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది.

Similar News

News January 18, 2026

దావోస్‌కు బయలుదేరిన CM చంద్రబాబు

image

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు CM చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం దావోస్‌కు బయల్దేరింది. రేపు ఉదయం 11 గంటలకు జ్యూరిచ్‌కు చేరుకోనుంది. సాయంత్రం తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని, రోడ్డు మార్గాన దావోస్‌కు CBN వెళ్లనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో భేటీ కానున్నారు. ఆయన వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ ఉన్నారు.

News January 18, 2026

తెలంగాణ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

image

* మెట్రో ఫేజ్ 2ఏ, ఫేజ్ 2బీ భూసేకరణకు సంబంధించి రూ.2,787 కోట్ల కేటాయింపునకు ఆమోద ముద్ర
* ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం
* 2027లో జులై 27- ఆగస్టు 3 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు బాసర-భద్రాచలం వరకు ఉన్న పురాతన ఆలయాల శాశ్వత అభివృద్ధి, ఎకో పార్కుల నిర్మాణానికి నిర్ణయం
* మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి నిర్ణయం

News January 18, 2026

30ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు చేయించుకుంటే బెటర్

image

30ఏళ్లు దాటిన వాళ్లు అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఏడాదికోసారి BP, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ ఫంక్షన్, కంటి పరీక్షలు, థైరాయిడ్ టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. 30-65ఏళ్ల మహిళలు ప్రతి 3సంవత్సరాలకు పాప్ స్మియర్/5ఏళ్లకు HPV టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు.