News August 22, 2024
NZB: గల్లంతైన చిన్నారి అనన్య మృతదేహం లభ్యం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనంద్‌నగర్ లో నిన్న సాయంత్రం వరద నీటిలో <<13910342>>గల్లంతైన చిన్నారి <<>>అనన్య మృతదేహం లభ్యమయింది. రాత్రి వరకు మున్సిపల్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది గాలించినప్పటికీ చీకటి కారణంగా ఆచూకీ దొరకలేదు. అయితే డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది మున్సిపల్ కార్మికులతో గాలింపు చర్యలు చేపట్టగా పీఎఫ్ ఆఫీస్ వెనుక ప్రాంతంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.
Similar News
News March 1, 2026
నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.
News March 1, 2026
NZB: డీసీఎం ఢీకొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నేపల్లి రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను డీసీఎం వ్యాను ఢీ కొట్టింది. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో పరుశురాం సదా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు SHO తెలిపారు.
News March 1, 2026
NZB: పీఎంశ్రీ పాఠశాలలను పరిశీలించిన సెంట్రల్ నోడల్ అబ్జర్వర్

జిల్లాలో పీఎం శ్రీనిధులు మంజూరైన పాఠశాలలను సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ రాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం శ్రీ నిధులతో కంజర, నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం పాఠశాలలలో చేపడుతున్న పనులను, జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పీఎం శ్రీ నిధులు మంజూరు చేసిన 40 పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు.


