News August 22, 2024
నిరసనలు: అటు వాళ్లు – ఇటు వీళ్లు

వివిధ అంశాలపై తెలంగాణలో అధికార – విపక్షాలు గురువారం నిరసనలకు దిగనున్నాయి. అదానీ స్టాక్స్ ప్రైస్ మ్యానిప్యులేషన్ ఆరోపణలపై జేపీసీతో విచారణకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. మరోవైపు తెలంగాణలో 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి జరగలేదని, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో విపక్ష బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
Similar News
News January 3, 2026
వరి ఉత్పత్తిలో చైనాను దాటేసిన భారత్.. ఎలా సాధ్యమైందంటే?

చైనా ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ 152 మిలియన్ మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో భారత్ ప్రపంచంలోనే No.1 స్థానానికి చేరింది. చైనాను దాటేయడంలో.. తైవాన్ ఇచ్చిన పొట్టి రకం (TN1) విత్తనాలు మన సాగును మలుపు తిప్పాయి. వీటికి తోడు IR-8, మన దేశీ రకం ‘జయ’ రాకతో ఉత్పత్తి భారీగా పెరిగింది. ఈ రకాలు నీటి ఎద్దడిని తట్టుకుని నిలబడగలిగాయి. శాస్త్రవేత్తల ప్రయోగాలకు రైతుల కష్టం తోడవ్వడంతో భారత్ ‘రైస్ కింగ్’గా అవతరించింది.
News January 3, 2026
ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్, ముంబైలో ఉద్యోగాలు

<
News January 3, 2026
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ ధర రూ.380 తగ్గి రూ.1,35,820కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.350 తగ్గి రూ.1,24,500 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.4000 తగ్గి రూ.2,56,000కు చేరింది. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ ధర రూ.1,35,970గా ఉండగా, కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షలుగా ఉంది.


