News August 22, 2024
కర్నూల్ జిల్లాకు రూ.59.60 కోట్లు

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం 2వ విడత నిధులు రూ.59.60 కోట్లు విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజునాయుడు తెలిపారు. నంద్యాల జిల్లాలోని 488 పంచాయతీలకు రూ.28.05 కోట్లు మంజూరు కాగా, కర్నూలు జిల్లాలోని 482 పంచాయతీలకు రూ.31.56 కోట్లు వచ్చాయని వివరించారు.
Similar News
News March 6, 2026
మహిళలను సన్మానించండి: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మహిళా పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలకు ప్రశంసా పత్రాలు అందచేసి సన్మానించాలని సూచించారు.
News March 5, 2026
కర్నూలు: 15న ఫైనల్ పరీక్ష

అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో ఈనెల 15న ఫైనల్ పరీక్ష జరగనుంది. 1.61లక్షల మంది హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఫైనల్ పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై వయోజన విద్య, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అందరూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.
News March 5, 2026
కర్నూలు: ఇంటర్ పరీక్షలకు 79 మంది డుమ్మా

కర్నూలు జిల్లాలో గురువారం ఇంటర్ ఓపెన్ స్కూల్ హిందీ, తెలుగు, ఉర్దూ పరీక్షలు జరిగాయి. 79 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్.సుధాకర్ తెలిపారు. 889మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 810మంది వచ్చారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 4 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. డీఈవో 2 సెంటర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.


