News August 22, 2024

ఆపద్బాంధవుడు అన్నయ్య: పవన్

image

మెగాస్టార్ చిరంజీవికి ఆయన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేశారని కొనియాడారు. కావాల్సిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారని, ఆ గుణమే చిరంజీవిని సుగుణ సంపన్నుడిగా చేసిందన్నారు. జనసేనకు రూ.5 కోట్లు విరాళమిచ్చి విజయంలో సహకరించిన ఆయన చిరాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు.

Similar News

News February 13, 2025

వక్ఫ్ బిల్లుపై JPC నివేదికకు రాజ్యసభ ఆమోదం

image

వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(JPC) నివేదికకు రాజ్యసభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల నిరసన మధ్యే కేంద్రం ఆమోదం తెలిపింది. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం JPC ఇటీవల సవరణ బిల్లు నివేదికను ఆమోదించింది. కాగా వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే ఇది ముస్లింల హక్కులపై దాడేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

News February 13, 2025

24 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డా: విశ్వక్ సేన్

image

24 ఏళ్ల వయసులో తాను ప్రేమలో పడినట్లు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చెప్పారు. ఆ తర్వాత బ్రేకప్ జరగడంతో బాధపడినట్లు చెప్పారు. దాని నుంచి కోలుకొని కెరీర్‌పై ఫోకస్ చేశానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత ఎవరిపై ఇష్టం కలగలేదని, సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని తెలిపారు. జీవితంలో కొన్ని ఘటనలు కన్నీళ్లు తెప్పిస్తాయని, 27 ఏళ్ల వయసులోనూ ఏడ్చిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు.

News February 13, 2025

ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు: లావణ్య

image

TG: అమ్మాయిల జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడని హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఆరోపించారు. ‘పదుల సంఖ్యలో అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేశాడు. ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు. ప్రతిక్షణం భయంతో బతుకుతున్నా. నాకేం జరిగినా మస్తాన్ సాయి కుటుంబానిదే బాధ్యత. జీవితం, నా మనిషిని కోల్పోయా. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని సారీ చెప్పాలనుకుంటున్నా. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దు’ అని లావణ్య అన్నారు.

error: Content is protected !!