News August 22, 2024

80 శాతం రాయితీతో విత్తనాలు

image

AP: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో సాధారణం(37 లక్షల ఎకరాలు) కంటే 15 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉలవ, పెసర, అలసందలు, జొన్న, మినుము, కొర్ర, సజ్జలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 8 జిల్లాల రైతులకు 69వేల క్వింటాళ్ల విత్తనాలు అందించనుంది.

Similar News

News January 31, 2026

తిరుమల నెయ్యి.. క్లీన్ చిట్ వచ్చినట్లు YCP ప్రచారం: పయ్యావుల

image

AP: తిరుమలలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని 2022లో CFTRI రిపోర్ట్ ఇచ్చిందని, దాన్ని YCP తొక్కిపెట్టిందని మంత్రి పయ్యావుల ఆరోపించారు. ‘మేం వచ్చాకే కల్తీ వ్యవహారం బయటపడింది. నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలున్నాయని NDDB రిపోర్టులో తేలింది. అయినప్పటికీ సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు YCP ప్రచారం చేసుకుంటోంది. YCP హయాంలో TTD నిబంధనల మార్పుతోనే దుర్మార్గపు పనులకు పునాది పడింది’ అని మండిపడ్డారు.

News January 31, 2026

పాడి పశువులకు ‘దశరథ గడ్డి’తో కలిగే లాభాలివే

image

☛ దశరథ గడ్డిని ఆవులు, గేదెలకు ప్రతిరోజూ 2 కేజీల చొప్పున ఇస్తే పాల దిగుబడి, వెన్నశాతం వృద్ధి చెందుతుంది.
☛ మేకలు, గొర్రెలకు దాణా బదులుగా 50 శాతం ఈ గడ్డిని ఆహారంగా ఇస్తే వాటి పెరుగుదల బాగుంటుంది.
☛ లేయర్ (ఆడ) కోడిపిల్లలకు ఆహారంలో 6 శాతం ఈ గడ్డిని ముక్కలు చేసి వేస్తే గుడ్ల నాణ్యత పెరుగుతుంది.
☛ కుందేళ్లు, పందులకు ఈ గడ్డిని అందిస్తే వాటి పెరుగుదల వేగంగా ఉంటుంది.

News January 31, 2026

ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థకు ముప్పు: ఎకనామిక్ సర్వే

image

రాష్ట్ర ప్రభుత్వాల ఉచిత పథకాలు ప్రజా ధనాన్ని హరిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు లేకుండా చేస్తున్నాయని ఆర్థిక సర్వే 2025-26 హెచ్చరించింది. నగదు బదిలీ పథకాల వల్ల రాష్ట్రాల ఖర్చు భారీగా పెరిగినట్లు తెలిపింది. ఫలితంగా రోడ్లు, ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాలకు నిధులు తగ్గినట్లు పేర్కొంది. ఈ పరిస్థితి మారాలంటే బ్రెజిల్‌లోని ‘బోల్సా ఫామిలియా’ వంటి ఫలితాల ఆధారిత నమూనాలను అనుసరించాలని సూచించింది.