News August 22, 2024

రహస్య కెమెరాలతో 13వేల నగ్న వీడియోలు.. పట్టించిన భార్య

image

అమెరికాలో చిన్నారులు, మ‌హిళ‌ల న‌గ్న చిత్రాల‌ను రికార్డ్ చేస్తున్న ఓ భార‌తీయ వైద్యుడిని అత‌ని భార్య పోలీసుల‌కు ప‌ట్టించింది. ఆస్ప‌త్రి గ‌దులు, బాత్రూంల్లో ర‌హ‌స్య కెమెరాలతో చిత్రాలు, వీడియోలు రికార్డు చేయడ‌ంతో ఉమేర్ ఏజాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక్క హార్డ్ డ్రైవ్ లోనే 13వేల వీడియోలను గుర్తించారు. ఎంతో మంది మహిళలతో చేసిన లైంగికచర్యల వీడియోలనూ రికార్డు చేసినట్టు ఒక్లాండ్ కౌంటీ అధికారి తెలిపారు.

Similar News

News January 15, 2025

ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్‌కు BIG షాక్

image

నామినేషన్లకు ముందు ఢిల్లీ మాజీ CM అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్! లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయన్ను విచారించేందుకు EDకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులను విచారించే ముందు ED అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు నవంబర్లో సూచించిన సంగతి తెలిసిందే. కాగా తనపై తప్పుడు ఛార్జిషీటు దాఖలు చేశారని కేజ్రీ ఆరోపిస్తున్నారు.

News January 15, 2025

24 గంటల్లో Rs1.87 లక్షలు పెరిగిన BITCOIN

image

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో అదరగొట్టాయి. మార్కెట్ విలువ 2.93% ఎగిసి $3.37Tకి చేరుకుంది. 57% మార్కెట్ డామినెన్స్ ఉన్న బిట్‌కాయిన్ $94,836 నుంచి 2.43% పెరిగి $97,043 వద్ద ట్రేడవుతోంది. అంటే $2207 (Rs1.87L) లాభపడింది. ఎథీరియం సైతం 2.81% ఎగిసి $3226 వద్ద చలిస్తోంది. XRP ఏకంగా 9.69% పెరిగి $2.79కు చేరుకుంది. BNB 1.54, SOL 2.75, DOGE 5.51, ADA 7.63, AVAX 4.18, XLM 7.81% మేర పెరిగాయి.

News January 15, 2025

ఇవాళ నాన్-వెజ్ తింటున్నారా?

image

సంక్రాంతి వేడుకల్లో నేడు ఆఖరి రోజు కనుమ. ఇవాళ తెలుగు రాష్ట్రాల ప్రజలు మాంసాహారం తినడానికి మొగ్గు చూపుతారు. తెలంగాణలో చాలా మంది నిన్న సంక్రాంతి రోజు సైతం నాన్-వెజ్ లాగించేశారు. ఈ రోజు తెలంగాణతో పాటు ఏపీలో భారీ స్థాయిలో చికెన్, మటన్ కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.210 నుంచి రూ.230 వరకు ఉంది. మటన్ రేటు HYDలో రూ.850పైనే ఉంది. మరి ఇవాళ మీరు నాన్-వెజ్ తింటారా? కామెంట్ చేయండి.