News August 22, 2024
9 కోట్ల ఉపాధి దినాలతో 54 లక్షల కుటుంబాలకు లబ్ధి: పవన్ కళ్యాణ్
AP: పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అందులో భాగంగా దేశంలో ఎప్పుడూ లేని విధంగా రేపు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 87 రకాల పనుల కోసం ₹4,500 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఆ పనులకు సంబంధించి గ్రామ సభల్లో తీర్మానాలు చేస్తామని పేర్కొన్నారు. 9 కోట్ల ఉపాధి దినాలతో 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
Similar News
News January 24, 2025
రాజకీయాలకు గుడ్ బై: విజయసాయిరెడ్డి
AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ నేత, వైఎస్ జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పవన్‌తో చిరకాల స్నేహం ఉందని, భవిష్యత్తు వ్యవసాయం అంటూ రాసుకొచ్చారు.
News January 24, 2025
BSNL కస్టమర్లకు గుడ్‌న్యూస్
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం BSNL కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో దేశంలో 65వేలు+ 4G టవర్లను ఏర్పాటు చేసింది. అందులో 2వేల కంటే ఎక్కువ టవర్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లో 675, రంగారెడ్డిలో 100, మెదక్‌లో 158, నల్గొండలో 202, మహబూబ్‌నగర్‌లో 151, ఆదిలాబాద్‌లో 141, నిజామాబాద్‌లో 113, కరీంనగర్‌లో 98, వరంగల్‌లో 231, ఖమ్మంలో 219 టవర్స్ ఏర్పాటు చేశామంది.
News January 24, 2025
650 పోస్టులు.. ఎంపికైన వారి లిస్టు విడుదల
TG: అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్టును TGPSC విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ప్రొవిజినల్ లిస్టును <