News August 22, 2024

వైద్యులు విధులకు హాజరుకాకపోతే గైర్హాజరుగా పరిగణిస్తాం: సుప్రీంకోర్టు

image

హ‌త్యాచార బాధితురాలికి న్యాయం చేయాల‌ని కోరుతూ కోల్‌కతా ఆర్జీ కర్ కాలేజీ వద్ద నిరసనకు దిగిన వైద్యులు విధుల‌కు హాజ‌రుకాక‌పోతే గైర్హాజ‌రుగా ప‌రిగ‌ణించాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. త‌మ హాజ‌రును న‌మోదు చేయాల్సిందిగా వారు అడ్మినిస్ట్రేష‌న్‌ను ఆదేశించ‌లేరని సీజేఐ బెంచ్ స్ప‌ష్టం చేసింది. వైద్యులు విధుల‌కు హాజ‌రైతే గైర్హాజ‌రైన రోజుల‌ విషయంలో సానుకూలంగా స్పందించేలా ఆదేశిస్తామని తెలిపింది.

Similar News

News January 24, 2025

బీఆర్ఎస్ పార్టీకి షాక్

image

TG: కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నగర మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడనున్నారు. రేపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

News January 24, 2025

సైఫ్‌కు రూ.25 లక్షల బీమాపై జోరుగా చర్చ

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకేసారి రూ.25 లక్షల బీమా మంజూరు చేయడం SMలో విస్తృత చర్చకు దారితీసింది. అదే సామాన్యులకైతే ఎన్నో కొర్రీలు పెట్టి, తమ చుట్టూ తిప్పుకున్న తర్వాత ఏదో కొంత ఇస్తారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సామాన్యులు డిశ్చార్జి అయిన తర్వాత కూడా క్లైమ్ చేయరు. VVIPలకు మాత్రం ఆగమేఘాల మీద బీమా క్లెయిమ్ చేస్తారని మండిపడుతున్నారు.

News January 24, 2025

తలకు ఆనుకొని భారీ కణితి.. కాపాడిన వైద్యులు

image

ఫొటో చూసి రెండు తలలతో ఉన్న శిశువు అనుకుంటున్నారా? కాదు. ఈ పాపకు తలతో పాటు భారీ కణితి ఏర్పడింది. దీనిని ఆక్సిపిటల్ ఎన్సెఫలోసెల్ అనే డిసీస్ అని ఓ వైద్యుడు ఈ ఫొటో షేర్ చేశారు. పుట్టుకతోనే మెదడుతో పాటు చుట్టుపక్కల కణజాలం పుర్రె నుంచి బయటకు వస్తాయని తెలిపారు. ఎంతో క్లిష్టమైన చికిత్సను తాము పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం వల్ల వీటిని ముందే గుర్తించవచ్చన్నారు.