News August 22, 2024

YS జగన్ వల్లే ఎసెన్షియా ఫార్మా ప్రమాదం: టీడీపీ

image

AP: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని టీడీపీ ఆరోపించింది. ‘ప్రభుత్వం చేయాల్సిన సేఫ్టీ ఆడిట్‌ను థర్డ్ పార్టీ ఏజెన్సీతో చేయిస్తానన్న YS జగన్ దాన్నీ సరిగ్గా చేయించలేదు. లొసుగులు ఉన్న కంపెనీలను బెదిరించి డబ్బులు దండుకున్నారు. అందుకే ఎల్జీ పాలిమర్స్ తర్వాత కూడా వరుసగా 15 ప్రమాదాలు జరిగాయి’ అని Xలో విమర్శించింది.

Similar News

News January 21, 2026

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ మరోసారి బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.7,480 పెరిగి రూ.1,61,100కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.6,850 ఎగబాకి రూ.1,48,474 పలుకుతోంది. నేషనల్, ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు బంగారంవైపు మళ్లినట్లు తెలుస్తోంది.

News January 21, 2026

నైనీ బొగ్గు టెండర్లపై కేంద్రం అత్యవసర సమీక్ష

image

TG: నైనీ బొగ్గు టెండర్ల వివాదంపై CM రేవంత్, Dy CM భట్టి, మంత్రి వెంకట్‌రెడ్డిలపై BRS ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ కుంభకోణంలో పాత్ర లేకపోతే విచారణ చేయించాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి హరీశ్ సవాల్ విసిరారు. ఈ తరుణంలో మంత్రి ఆదేశాలతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ అధికారులు అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. నైనీతోపాటు ఇతర బొగ్గు బ్లాక్‌లపైనా సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

News January 21, 2026

రేపు ఎంపీలతో జగన్ భేటీ

image

AP: వైసీపీ అధినేత జగన్ రేపు తమ పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. మెడికల్‌ కాలేజీల పీపీపీ విధానం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో నేడు జగన్ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.