News August 22, 2024
24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఒలింపిక్ స్టార్
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అర్చనా కామత్ 24 ఏళ్లకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. USలో ఉన్నత విద్య చదివేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆర్థిక అవసరాలు, మరో నాలుగేళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆటకు వీడ్కోలు పలికినట్లు సమాచారం. TT భారత జట్టు తొలిసారి పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించడంలో అర్చనా కామత్ కీలక పాత్ర పోషించారు.
Similar News
News January 24, 2025
బీఆర్ఎస్ పార్టీకి షాక్
TG: కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నగర మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడనున్నారు. రేపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు.
News January 24, 2025
సైఫ్‌కు రూ.25 లక్షల బీమాపై జోరుగా చర్చ
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకేసారి రూ.25 లక్షల బీమా మంజూరు చేయడం SMలో విస్తృత చర్చకు దారితీసింది. అదే సామాన్యులకైతే ఎన్నో కొర్రీలు పెట్టి, తమ చుట్టూ తిప్పుకున్న తర్వాత ఏదో కొంత ఇస్తారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సామాన్యులు డిశ్చార్జి అయిన తర్వాత కూడా క్లైమ్ చేయరు. VVIPలకు మాత్రం ఆగమేఘాల మీద బీమా క్లెయిమ్ చేస్తారని మండిపడుతున్నారు.
News January 24, 2025
తలకు ఆనుకొని భారీ కణితి.. కాపాడిన వైద్యులు
ఫొటో చూసి రెండు తలలతో ఉన్న శిశువు అనుకుంటున్నారా? కాదు. ఈ పాపకు తలతో పాటు భారీ కణితి ఏర్పడింది. దీనిని ఆక్సిపిటల్ ఎన్సెఫలోసెల్ అనే డిసీస్ అని ఓ వైద్యుడు ఈ ఫొటో షేర్ చేశారు. పుట్టుకతోనే మెదడుతో పాటు చుట్టుపక్కల కణజాలం పుర్రె నుంచి బయటకు వస్తాయని తెలిపారు. ఎంతో క్లిష్టమైన చికిత్సను తాము పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం వల్ల వీటిని ముందే గుర్తించవచ్చన్నారు.