News August 22, 2024

NLG: పర్యావరణహితుడు .. మన సైదులు!

image

చౌటుప్పల్ కు చెందిన నిల్లిగొండ సైదులు ఏటా మట్టి గణేశ్‌ విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషి చేస్తున్నారు. బీఎస్సీ చదివి స్వయం ఉపాధిగా కులవృత్తిని ఎంచుకున్న సైదులు.. సొంతూరిలో కుండలతో పాటు గ్రామ దేవతల విగ్రహాలు, పూజకు అవసరమయ్యే వస్తువులను మట్టితో తయారు చేస్తూ పర్యావరణహితుడిగా పేరు పొందాడు. ఈ ఏడాది 20 వేల మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసినట్లు తెలిపారు.

Similar News

News March 2, 2026

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

నల్గొండ మండలం చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంటు సమీపంలో నకిరేకల్ నుంచి నల్గొండకు వస్తున్న బైక్, ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News March 1, 2026

నల్గొండ: పంచాయతీ నిధులపై పాత, కొత్త ‘సర్పంచుల’ పోరు

image

గ్రామ పంచాయతీలకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం ఇప్పుడు పాత, కొత్త సర్పంచుల మధ్య చిచ్చు పెడుతోంది. గతంలో పూర్తి చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.50 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుత నిధుల నుంచి ఆ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త సర్పంచులు తమ అభీష్టం మేరకే
నిధులు ఖర్చు చేస్తామంటున్నారు. పాత బిల్లులు చెల్లించాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.

News March 1, 2026

నల్గొండ: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

image

జిల్లాలో యాసంగి సాగు పనులు చివరి దశకు చేరుకున్నా, పెట్టుబడి సాయం అందక 10.82 లక్షల మంది అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఏటా నవంబర్‌లోనే విడుదల కావాల్సిన ‘రైతు భరోసా’ నిధులు ఇప్పటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో వరి, మిర్చి సాగుదారులు అప్పుల కోసం ఎదురుచూస్తున్నారు. సాగు కాలం ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.