News August 22, 2024
తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షలు: సీఎం
AP: అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి ₹50లక్షలు ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సాధారణంగా గాయపడిన వారికి ₹25లక్షలు ఇస్తామన్నారు. మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం వారి కుటుంబీకులతో ఆయన మాట్లాడారు. వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. కాగా మృతుల కుటుంబాలకు ₹కోటి చొప్పున ఇస్తామని కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2025
మార్చి 31న బ్యాంకులకు సెలవు లేదు: RBI
మార్చి 31వ తేదీన దేశంలోని బ్యాంకులకు సెలవు రద్దు చేస్తూ RBI నిర్ణయం తీసుకుంది. ఆ రోజున ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం చివరి తేదీ కావడంతో అన్ని లావాదేవీలు పూర్తి కావాలనే ఉద్దేశంతో RBI ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మార్చి 31న సెలవు ఇస్తే లావాదేవీలన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో అన్ని బ్యాంకులు ఆ రోజు పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
News February 13, 2025
చిరంజీవి మనవడి కామెంట్స్‌పై SKN ట్వీట్
తనకు ఒక మనవడు కావాలని మెగాస్టార్ చిరంజీవి చెప్పడంలో తప్పేముందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నిర్మాత SKN దీనిపై ట్వీట్ చేశారు. ‘పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం ఆయనది. ఎవరినీ ఏమీ అనని మనిషి కదా అని ఊరికే అవాకులు చెవాకులు పేలటం, అనవసరంగా రాద్ధాంతం చేసి శునకానందం పొందడం కొందరికి అలవాటు’ అని పేర్కొన్నారు.
News February 13, 2025
16న ఢిల్లీ సీఎం ఎంపిక?
UP, MP, రాజస్థాన్ తరహాలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను ఢిల్లీలో అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నెల 16న శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేసిన అధిష్ఠానం అదే రోజున సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రేసులో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు విజయేందర్, ఆశిష్ సూద్, పవన్ శర్మ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 చోట్ల బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.