News August 22, 2024
HYDలో పీల్చే గాలి చంపేస్తోంది!
HYDలో కాలుష్యం పెరుగుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ‘స్టేటస్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్’ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2000 నుంచి 2019 వరకు నగరంలో పీఎం 2.5 వంటి సూక్ష్మదూళి కణాల ఉద్గారాలతో అనేక మంది శ్వాసకోశ సంబంధ సమస్యల బారిన పడి మరణించినట్లు వెల్లడించింది. 2000 నాటికి కాలుష్యం బారిన పడి 2,810 మంది, 2019 నాటికి 6,460 మంది మరణించారు.
Similar News
News November 26, 2024
HYD: ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక నజర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా క్యారేజ్ వే ఆక్రమణలను తొలగించారు. హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ ఆధ్వర్యంలో తొలగింపు పనులు చేపట్టారు. అలాగే అనుమతులు లేకుండా సైరన్‌లు ఉపయోగిస్తున్న వారిపై చర్యలకు దిగారు. అనుమతి లేని సైరన్‌లను తీసివేస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా సైరన్లు ఉపయోగిస్తే చర్యలు ఉంటాయన్నారు.
News November 26, 2024
HYD విశ్వనగరంగా మారడంలో OU పాత్ర ఉంది: దినేశ్ చంద్ర శర్మ
HYD విశ్వనగరంగా మారడంలో నగరంలో ఉన్న జ్ఞాన సంపద కీలకంగా పనిచేస్తుందని సీనియర్ సైన్స్ జర్నలిస్ట్ దినేష్ చంద్ర శర్మ అన్నారు. విశ్వనగరంగా మారడంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఓయూ, ఐఐసీటీ వంటి సంస్థలను చాలా కాలం క్రితమే నెలకొల్పడంతో పాటు దశాబ్దాలుగా ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు దీనికి తోడయ్యాయని అభిప్రాయపడ్డారు. ఓయూ జర్నలిజం విభాగంలో విద్యార్థులతో ముఖాముఖికి ఆయన హాజరయ్యారు.
News November 26, 2024
HYD: నెమళ్ల సంఖ్య గతేడాది 565.. మరి ఈ ఏడాది..?
నగరంలో పేరుగాంచిన KBR పార్కులో నెమళ్ల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుకుంటే వచ్చేనెల 3వ తేదీ వరకు ఆగాల్సిందే. జాతీయ పక్షులు పార్కులో ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు. ఆ వివరాలను డిసెంబర్ 3వ తేదీ ప్రకటిస్తామని పార్క్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గతేడాది KBR పార్కులో 565 నెమళ్లు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.