News August 22, 2024
సెబీ కుంభకోణంపై BRS ఎందుకు మాట్లాడట్లేదు: రేవంత్

ఈ దేశానికి బీజేపీ ముప్పుగా మారిందని సీఎం రేవంత్ విమర్శించారు. మోదీపై కొట్లాడుతున్నామని BRS చెబుతోందని, అలా అయితే సెబీ కుంభకోణంపై ఆ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ‘ప్రతి చిన్నదానిపై స్పందించే కేటీఆర్ అదానీ వ్యవహారంపై ఎందుకు మాట్లాడట్లేదు. బీజేపీకి BRS అనుకూలంగా ఉన్నారనేందుకు ఇదే స్పష్టమైన సాక్ష్యం. మోదీ, అమిత్ షాను సంతోషపర్చడానికి రాజీవ్ విగ్రహం తొలగిస్తామంటున్నారు’ అని ఫైరయ్యారు.
Similar News
News December 28, 2025
కోటీశ్వరుడు.. ర్యాపిడో డ్రైవరయ్యాడు

కరోనా కష్టాలు ఒక కోటీశ్వరుడిని ర్యాపిడో డ్రైవర్‌గా మార్చేశాయి. ఒకప్పుడు ₹కోట్లలో వ్యాపారం చేసిన ఆయన కొవిడ్ వల్ల ఏకంగా ₹14 కోట్లు నష్టపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఉపాధి కోసం ర్యాపిడో నడుపుతున్నారు. Amity యూనివర్సిటీలో చదివిన అతడు ఒక ప్రయాణికుడితో తన బాధ పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న కథ నెట్టింట వైరలవుతోంది. ‘ఇప్పటికీ దేవుడిపై నమ్మకం ఉంది. ఓటమిని ఒప్పుకోను’ అంటున్న ఆయన ధైర్యం కదిలిస్తోంది.
News December 28, 2025
Silver.. సారీ..! Stock లేదు!

వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్స్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపుల్లో సిల్వర్ బార్స్ లేవనే సమాధానం వస్తోంది. ఒకవేళ అక్కడక్కడా ఉన్నా 10గ్రా, 15g, 20g బార్స్ తప్ప వందలు, వేల గ్రాముల్లో లేవని చెబుతున్నారు. ఆర్డర్ పెడితే 4-7 రోజులకు వస్తుందని, ఆరోజు ధరకే ఇస్తామంటున్నారు. మీకూ ఇలా అయిందా? కామెంట్.
News December 28, 2025
EDలో 75పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(<


