News August 22, 2024

నెల్లూరు: పెన్నా నదిలో మృతదేహం కలకలం

image

పెన్నా నదివద్ద గురువారం మధ్యాహ్నం ఓ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని బయటకు తీశారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి పెన్నా నదిలో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Similar News

News March 8, 2026

అబ్దుల్‌ అజీజ్‌ తల్లి మృతి.. MP నివాళి

image

AP వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్‌ మృతి తమకు ఆవేదన కలిగించిందని MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో MP దంపతులు నెల్లూరులోని అబ్దుల్‌ అజీజ్‌ ఇంటికి వెళ్లి అన్వర్ జాన్‌ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

News March 7, 2026

అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. మంత్రి సంతాపం

image

AP వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ X వేదికగా స్పందించారు. అన్వర్ జాన్ మృతిపట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.

News March 7, 2026

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: DMHO సుజాత

image

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా వైద్యాధికారి సుజాత అన్నారు. శనివారం వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య అనాధాశ్రమంలో మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులకు తేడా పోటీలు నిర్వహించి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. అనాధ బాలల మధ్య ఈ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.