News August 22, 2024
కల్యాణ లక్ష్మి పథకానికి నిధులు విడుదల: మంత్రి పొన్నం

బీసీ, ఈబీసీ కళ్యాణలక్ష్మి పథకానికి TG ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో కళ్యాణలక్ష్మి పథకానికి రూ.2175 కోట్లు కేటాయించింది. మొదటిదశలో రూ.1225.43 కోట్లు విడుదల చేసింది. పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి నిధులు విడుదల చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 4, 2025
చిన్నశంకరంపేట: ‘బాల్య వివాహాలు చట్ట విరుద్ధం’

చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లిలో విలేజ్ లెవల్ ఛైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కార్యదర్శి పద్మ, విజన్ ఎన్జీఓ ఆర్గనైజర్ యాదగిరి బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. 18 ఏళ్లలోపు బాలిక, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చట్ట విరుద్దమన్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులంతా కలిసి బాల్య వివాహాలు చేయమని తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు.
News November 4, 2025
కౌడిపల్లి: ‘విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి’

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు స్పష్టం చేశారు. కౌడిపల్లి ఆశ్రమ పాఠశాల తనిఖీ చేశారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలన్నారు. విద్యార్థులకు మాసహారం, చికెన్ పెట్టడం లేదని చెప్పారని, ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా నాణ్యమైన బోజనానికి కట్టుబడి ఉందన్నారు.
News November 4, 2025
మెదక్: స్పెషల్ లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: ఎస్పీ

ఈనెల 15న జరిగే స్పెషల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్ట్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ, ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.


