News August 22, 2024

కోనసీమ జిల్లాలో CM రేపటి పర్యటన షెడ్యూల్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలోని పల్లాలమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం సీఎం చంద్రబాబు సభ నిర్వహించనున్నారు. సీఎం పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలో బయలుదేరి హెలికాప్టర్‌ ద్వారా 11:40కి వానపల్లి చేరుతారు. 11:50 నుంచి 1:30 వరకు సభ.. అనంతరం 2:20కి హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో HYD వెళ్తారని తెలిపారు.

Similar News

News August 23, 2025

రాజమండ్రి: దోమల నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీ

image

రాజమండ్రిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ శుద్ధి లక్ష్యంగా స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు. ఇందులో భాగంగా కంబాల చెరువు పార్కులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు. డ్రోన్లతో మందులు పిచికారీ చేయడంతోపాటు, దోమల లార్వాలను తినే గాంబూసియా చేపలను చెరువులో వదిలారు. ఈ వినూత్న కార్యక్రమం పట్ల ఎమ్మెల్సీ హర్షం వ్యక్తం చేశారు.

News August 23, 2025

దేవరపల్లి: లారీ ఢీకొని సర్పంచ్ బుల్లారావు మృతి

image

దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సదర మండలం రామన్నపాలెం సర్పంచ్ కూచిపూడి బుల్లారావు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బుల్లారావు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 23, 2025

రాజమండ్రి: వీడిన మర్డర్ మిస్టరీ.. ఐదుగురి అరెస్ట్

image

ధవళేశ్వరానికి చెందిన వేపాడ సతీశ్ (23) హత్య కేసు మిస్టరీ వీడింది. టూ టౌన్ సీఐ శివ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న కైలాస భూమి శ్మశాన వాటిక సమీపంలో మద్యం తాగుతుండగా ఓ వ్యక్తిగత వ్యవహారంపై జరిగిన గొడవలో బి. రాధాకాంత్‌తో పాటు నలుగురు కలిసి సతీశ్‌ను కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశారు. అనుమానాస్పద కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురి అరెస్టు చేశారు.