News August 22, 2024
ప్రీ-రికార్డెడ్ కాల్స్, మెసేజ్‌లతో జాగ్రత్త: TRAI
ట్రాయ్ పేరుతో పలువురికి ప్రీ-రికార్డెడ్ కాల్స్, మెసేజ్‌లు రావడంపై వినియోగదారులను TRAI అప్రమత్తం చేసింది. ఇలాంటి కాల్స్ చేసి ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తామంటూ కొందరు దుండగులు వ్యక్తిగత సమాచారం కోరుతున్నారంది. ఇలా వచ్చే కాల్స్, మెసేజ్‌లు ఫేక్ అని, ఇలాంటి వాటితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. మొబైల్ కనెక్షన్ల రద్దుతో తమకు లింక్ లేదంది. అనుమానిత కాల్స్‌పై 1930 హెల్ప్‌లైన్ నంబర్, <
Similar News
News January 25, 2025
నేటి ముఖ్యాంశాలు
* AP: రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి
* మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: నారాయణ
* దావోస్‌లో ఏపీ బ్రాండ్ సర్వనాశనం: రోజా
* TG: 20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
* గోదావరి నీళ్లను పెన్నాకు తరలించే ప్రయత్నం: హరీశ్ రావు
* పెట్టుబడులపై చర్చకు వస్తారా?: టీపీసీసీ చీఫ్ సవాల్
* TG ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను వేధిస్తోంది: కిషన్ రెడ్డి
News January 25, 2025
PHOTOS: ‘మహాకుంభ్’లో డ్రోన్ షో
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభ మేళా సందర్భంగా డ్రోన్ షో నిర్వహించారు. 2,500 ‘మేడ్ ఇన్ ఇండియా’ డ్రోన్‌లను ఉపయోగించి భారతీయ పౌరాణిక చరిత్ర, సంప్రదాయాలను ప్రదర్శించారు. డ్రోన్‌లతో తీర్చిదిద్దిన శివుడు, శంఖం వంటి రూపాలు ఆకట్టుకున్నాయి.
News January 25, 2025
బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దు: హైకోర్టు
TG: రాష్ట్రంలో సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉ.8.40 గంటల మధ్య ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని తెలిపింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై విచారించింది. రేట్ల పెంపు అనుమతులను రద్దు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.