News August 22, 2024
5351 బ్యాంక్ ఉద్యోగాలు.. గడువు పెంపు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గడువును IBPS ఈ నెల 28 వరకు పొడిగించింది. వీటిలో 4,455 PO/మేనేజ్‌మెంట్ ట్రైనీస్ పోస్టులు, 896 SO జాబ్స్ ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈ, బీటెక్, PG, MBA పూర్తయిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం<
Similar News
News January 22, 2025
రెండో రోజు ఐటీ రైడ్స్
హైదరాబాద్‌లోని చిత్ర నిర్మాణ సంస్థలపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. SVC నిర్మాణ సంస్థ యజమానులు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రకటించిన కలెక్షన్లకు కడుతున్న ఆదాయ పన్నుకు మధ్య తేడాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
News January 22, 2025
వైస్ ప్రెసిడెంట్‌గా ఉషను ఎంపిక చేయాల్సింది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, భారత సంతతి మహిళ ఉషపై ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా తెలివైందని, ఉపాధ్యక్ష పదవికి ఉషనే ఎంపిక చేయాల్సింది కానీ వారసత్వం సరికాదు కాబట్టి జేడీని తీసుకున్నా’ అని వ్యాఖ్యానించారు. ఇక జేడీ గొప్ప సెనెటర్ అని, అందుకే ఆయనకు ఓహియో బాధ్యతలు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు.
News January 22, 2025
స్కూళ్లకు గుడ్‌న్యూస్
APలోని స్కూళ్లల్లో రూ.1450 కోట్లతో కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య తెలిపారు. 2026 నాటికి 855 స్కూళ్లలో ఆధునిక వసతులు కల్పిస్తామన్నారు. చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. గురుకులాల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.