News August 22, 2024

బోధన్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి

image

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి చెందిన ఘటన బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయికుమార్ (22) ఐదు రోజుల క్రితం రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి గోదావరిలో ఈతకు వెళ్లి మృతి చెందడు. అయితే కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి దేవర్ల వెంకటేశ్(54) గురువారం గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 

Similar News

News March 6, 2026

తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే: ఎంపీ అర్వింద్

image

నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ కమ్మ సంఘంలో శుక్రవారం బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమిపాలైన వారు నిరుత్సాహపడవద్దని, అది విజయానికి నాంది అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

News March 6, 2026

కమ్మర్‌పల్లి ప్రాంతంలో పులి సంచారం

image

మహారాష్ట్రలోని తాడోబా నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. బీట్ ఆఫీసర్ శ్రీదేవి ఈ పులిని ప్రత్యక్షంగా చూశారని తెలిసింది.

News March 6, 2026

NZB: నేడు BJP పార్లమెంట్ స్థాయి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం

image

NZB పార్లమెంట్ స్థాయి BJP విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నారు. అలాగే పార్లమెంట్ పరిధిలో నూతనంగా గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. మాధవ్ నగర్ లోని కమ్మ సంఘంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి MP ఈటల రాజేందర్, NZB MP అర్వింద్ ధర్మపురి, MLA లు హాజరవుతున్నారు.