News August 22, 2024
‘కల్కి’ ఓటీటీ వెర్షన్‌లో మార్పులు.. గమనించారా?

‘కల్కి’ సినిమా నిడివి థియేటర్లలో 181min ఉండగా, <<13909598>>OTTలో<<>> 175కు తగ్గింది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్, ప్రభాస్-దిశాపటానీ సాంగ్, ఫైట్లు, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్లను ట్రిమ్ చేశారు. థీమ్ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్ యాడ్ చేశారు. డబ్బింగ్‌లోనూ మార్పులు కనిపించాయి. థియేటర్ రిలీజ్ టైమ్‌లో నిడివి ఎక్కువైందన్న టాక్ రావడంతోనే ఇప్పుడు కుదించినట్లు తెలుస్తోంది. మీరు OTT వెర్షన్‌లోని ఈ మార్పులను గమనించారా?
Similar News
News March 11, 2026
‘మినిమం బ్యాలెన్స్’ ఫైన్‌లతో ₹19,000 కోట్లు

అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే కస్టమర్లపై వేసే ఫైన్ ద్వారా బ్యాంకులు మూడేళ్లలో (2022-23 to 2024-25) ₹19,000 కోట్లు కలెక్ట్ చేశాయి. దీంట్లో ప్రైవేట్ బ్యాంకులు ₹11,000 కోట్లు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ₹8,000 కోట్లు వసూలు చేశాయి. అత్యధికంగా ప్రైవేట్ రంగంలో HDFC (₹3,872Cr), పబ్లిక్ సెక్టార్‌లో PNB (₹1,578Cr) ఆదాయాన్ని ఆర్జించాయి. ఈ విషయాన్ని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది.
News March 11, 2026
సక్సెస్ స్టోరీ: 9 నెలల్లో ₹800 కోట్ల సామ్రాజ్యం..!

‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ అనే మాటను 23 ఏళ్ల అంజలి సర్దానా(బెంగళూరు) నిజం చేశారు. ఆమె స్థాపించిన ‘Pronto’ అనే హోమ్ సర్వీసెస్ యాప్ 9 నెలల్లోనే ₹800 కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది. క్లీనింగ్, కుకింగ్ వంటి ఇంటి అవసరాలను తీర్చే ఈ బిజినెస్ మోడల్ ఇన్వెస్టర్లను సైతం మెప్పించింది. దాదాపు 3వేల మందికి ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. యువత తలచుకుంటే ఆకాశమే హద్దు అని అంజలి సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది.
News March 11, 2026
పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగు – ఎన్నో లాభాలు

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.


