News August 22, 2024
టెక్కలిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

టెక్కలి మండలంలోని నర్సింగపల్లి, గూడెం, ముఖలింగాపురం పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాన్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ జీ.శంకర్ రావు గురువారం తెలిపారు. నర్సింగపల్లి 11 కెవి ఫీడర్ పై మరమ్మత్తులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. కావున విద్యుత్ వినియోగాదారులు సహకరించాలని కోరారు.
Similar News
News March 12, 2026
SKLM: రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం అమరావతిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేశారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.
News March 11, 2026
కోటబొమ్మాళి: భర్తపై భార్య దాడి

భర్తపై భార్య దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కోటబొమ్మాళి మండలం మంచాలపేటలో జరిగింది. భర్తను సోదరిడితో కలిసి ఓ గదిలో బంధించి కొట్టగా తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతరం గమనించిన కుటుంబీకులు తక్షణం సమీప ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 11, 2026
శ్రీకాకుళం పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పల నారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


