News August 22, 2024
రేపు అనకాపల్లి జిల్లాలో జగన్ పర్యటన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడి అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారని పార్టీ కార్యాలయం తెలిపింది. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకొని 11గంటలకు క్షతగాత్రులను జగన్ పరామర్శించనున్నారు.
Similar News
News November 7, 2025
విశాఖ: పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

13 నెలలుగా పెండింగ్‌లో ఉన్న రూ.400 కోట్లలో కనీసం 6 నెలల బిల్లులను వెంటనే చెల్లించాలని GVMC కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం GVMC గాంధీ విగ్రహ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి ధర్నా చేపట్టారు. బిల్లులు చెల్లించకపోతే ఇక పనులు చెయ్యలేమన్నారు. GVMC బడ్జెట్ ఉన్న వర్కులకు మాత్రమే టెండర్లు పిలవాలన్నారు. ధర్నా అనంతరం ర్యాలీగా వెళ్లి GVMC కమిషనర్, మేయర్‌కు వినతిపత్రం అందజేశారు.
News November 7, 2025
విశాఖ: పాఠశాలలకు రేపు సెలవు రద్దు

విశాఖలో రేపు రెండో శనివారం సందర్భంగా సెలవు రద్దు చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో.. ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్ణయించారు. ఈ మేరకు అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలు రేపు సాధారణంగా పనిచేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.
News November 7, 2025
విశాఖ రేంజ్లో వందేమాతరం గీతాలాపన

విశాఖ రేంజ్ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ‘వందేమాతరం’ గీతాలాపన చేశారు. జాతీయ గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకోవాలని, జాతీయ గీతాల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలని సూచించారు.


