News August 22, 2024
నీటి పైపు లైన్‌కు శంకుస్థాపన చేసిన ఒంగోలు MP

ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు-1 వద్ద నవోదయ స్కూల్‌కి వెళ్లే నీటి పైపులైన్‌కు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. నవోదయ స్కూల్ విద్యార్థుల నీటి సమస్యను పరిష్కరించేందుకు పైపులైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ సుజాత, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
ప్రకాశం: మత్స్యకారుడి గొంతులో ఇరుక్కున్న బతికున్న చేప.. చివరికి

ప్రకాశం జిల్లాలో గురువారం వింత ఘటన చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. అనంతరం చేపలు పట్టి బుట్టలో వేస్తుండగా ఓ చేప ఎగిరి అతని నోటిలో పడింది. తీసేలోపే అది కాస్తా గొంతులోకి వెళ్లింది. గమనించిన తోటి మత్స్యకారులు అతణ్ని వెంటనే ఒంగోలు GGHకు తరలించారు. ENT వైద్యులు HOD డాక్టర్ ప్రభాకర్ బృందం శస్త్రచికిత్స చేసి చాపను బయటకు తీశారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా ఉన్నారు.
News March 13, 2026
ప్రకాశం: ఓ ఫొటోతో ఆగిన పెళ్లి.. తల్లీకూతుర్లు సూసైడ్

ప్రకాశం జిల్లా మార్టూరు (M) ద్రోణాదులలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల మేరకు.. సుజాత (46) కుమార్తె (26) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మార్టూరు వాసి శేషుబాబుతో డిసెంబర్ 14న ఆమెకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. దివ్యకు పరిచయం ఉన్న ఓ యువకుడు ఆమెతో దిగిన ఫొటోను శేషుబాబుకు పంపాడు. దీంతో పెళ్లి ఆగిపోగా.. మనస్తాపంతో దివ్య, సుజాత ఈ నెల 4న పురుగుల మందు తాగారు. గుంటూరులో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు.
News March 13, 2026
ప్రకాశం: రైతుల ఖాతాల్లో నేడు నగదు

PM కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. ప్రకాశం జిల్లాలోని రైతులకు రూ.108.30 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. దర్శికి రూ.24.40 కోట్లు, కొండపికి రూ.21.10 కోట్లు, ఒంగోలుకు రూ.5.31 కోట్లు, S.Nపాడు రూ.15.85 కోట్లు, అద్దంకి రూ.23.31 కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శుక్రవారం బ్యాంక్ ఖాతాల్లో నగదు మంజూరు అవుతుందని తెలిపారు.


