News August 22, 2024

మజిల్ మెమరీతో పంత్ సెన్సేషన్

image

రిషభ్ పంత్‌లో మజిల్ మెమరీ, గెలుపు తృష్ణ ఉన్నాయని ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అన్నారు. అవే అతడిని చివరి పర్యటనలో సంచలనంగా మార్చేశాయని తెలిపారు. త్వరలో జరిగే బోర్డర్-గవాస్కర్ టోర్నీలో టీమ్ఇండియాకు అతడే కీలకం అవుతాడని పేర్కొన్నారు. అతడి ఆటతీరు బాగుంటుందని, అందుకే ఆసీస్ ప్రజలు అతడిని అభిమానిస్తారని చెప్పారు. 2020-21 పర్యటనలో పంత్ 97, 89 పరుగుల ఇన్నింగ్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

Similar News

News January 15, 2025

ITR దాఖలుకు ఇవాళే చివరి తేదీ

image

2023-24కు గాను ఐటీఆర్ ఫైలింగ్‌కు ఇవాళే చివరి తేదీ. లేట్, రివైజ్డ్ రిటర్న్స్‌ను రాత్రి 12 గంటల్లోపు దాఖలు చేయాలి. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. మొత్తం ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. నేడు ITR దాఖలు చేయకపోతే లీగల్ నోటీసులు, జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

News January 15, 2025

ఆకట్టుకుంటున్న ‘మిరాయ్’ పోస్టర్

image

కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో యంగ్ హీరో తేజా సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ నుంచి మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. చుట్టూ పురాతన దేవాలయాలు, శిథిల భవనాల మీదుగా హీరో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో మూవీపై ఆసక్తిని పెంచుతోంది. ‘గత సంక్రాంతికి ఎగరడం ప్రారంభించా. మీ ప్రేమతో ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నా’ అని తేజ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత ఏడాది రిలీజైన ‘హనుమాన్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.

News January 15, 2025

ధూమపానం, మద్యపానం, అధిక బరువుతో అనేక క్యాన్సర్లు!

image

ధూమపానం, మద్యపానానికి బానిసలై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించడాన్ని మానేస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అధిక బరువు వల్ల 13 రకాల క్యాన్సర్లు, స్మోకింగ్ వల్ల ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావొచ్చని తెలిపారు. ఆల్కహాల్ వల్ల స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్ వస్తుంది. అందుకే వీటిని మానేసి పౌష్టికాహారం తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదంటున్నారు.