News August 22, 2024

నంద్యాల: ఉల్లిగడ్డల లారీ బోల్తా

image

పాణ్యం మండలంలోని తమ్మరాజు పల్లె గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉల్లిగడ్డల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఉల్లిగడ్డల బస్తాలన్నీ చెల్లాచెదురయ్యాయి. లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 22, 2026

గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలపై కలెక్టర్ దృష్టి

image

జిల్లాలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఇండక్షన్ స్టవ్‌లు, సోలార్, ఎలక్ట్రిక్ కుక్కర్లు వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గ్యాస్ కొరత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పరికరాల లభ్యత, ధరలు, సరఫరాపై పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. అవసరమైతే కిరోసిన్ స్టౌవ్‌ల డేటాను కూడా సిద్ధం చేయాలన్నారు. ప్రత్యామ్నాయ వంట పద్ధతులపై ప్రణాళిక అందించాలన్నారు.

News March 22, 2026

ఈ నెల 26న జిల్లాస్థాయి ఉషూ పోటీలు

image

ఈనెల 26న కర్నూలులోని కిడ్స్ వరల్డ్ రోశయ్య కమ్యూనిటీ హాలులో 8వ జిల్లాస్థాయి ఉషూ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి టి.శ్రీనివాసులు తెలిపారు. పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.