News August 22, 2024

సబ్ కలెక్టర్లుగా ట్రైనీ IASలు

image

TG: 2022 బ్యాచ్ ట్రైనీ IASలను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్‌గా శ్రద్ధా శుక్లా, బాన్సువాడకు కిరణ్మయి, మిర్యాలగూడకు నారాయణ్ అమిత్, బోధన్‌కు వికాస్ మహతో, తాండూర్‌కు ఉమాశంకర్ ప్రసాద్, కాటారానికి మయాంక్ సింగ్, ఉట్నూరుకు ఎం.యువరాజ్‌లను నియమించింది.

Similar News

News March 19, 2026

మార్చి 19: చరిత్రలో ఈ రోజు

image

1952: టాలీవుడ్ నటుడు మోహన్ బాబు జననం(ఫొటోలో)
1952: కమెడియన్, మాజీ మంత్రి బాబూ మోహన్ జననం
1955: హాలీవుడ్ నటుడు, నిర్మాత బ్రూస్ విల్లీస్ జననం
1982: ఆచార్య జె.బి.కృపలానీ మరణం
1984: హీరోయిన్ తనుశ్రీ దత్తా జననం
2008: సినీనటుడు రఘువరన్ మరణం
2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం

News March 19, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 19, 2026

ఓటుకు నోటు దొంగ రేవంత్: హరీశ్ రావు

image

TG: వీధి దీపాలు కూడా సరిగా పెట్టడం చేత కాని సీఎం రేవంత్ విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజలకు గ్యారంటీల పేరు చెప్పి, మాయ చేసి ఓట్లు దండుకున్న రేవంత్‌ను మించిన మారీచుడు ఇంకెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. రైతు ద్రోహి అని, ఓటుకు నోటు దొంగ అని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు దిక్కు లేదని, ప్రభుత్వానికి ముందుంది మొసళ్ల పండగని హెచ్చరించారు.